కోల్ కతా కాలేజ్ మెరిట్ లిస్ట్ లో సన్నీలియోన్ పేరు...!!

కోల్ కతా కాలేజ్ మెరిట్ లిస్ట్ లో సన్నీలియోన్ పేరు...!!

పెద్దల సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటోంది సన్నీలియోన్.  కరోనా సమయంలో తన అత్తగారిని చూసుకోవడానికి లాస్ ఏంజిల్స్ వెళ్ళింది. సినిమా ఇండస్ట్రీలో పాపులరైన సన్నీలియోన్ కోల్ కతాలోని ఓ కాలేజీ మెరిట్ లిస్ట్ లో పేరు సంపాదించుకుంది.  ఈ న్యూస్ వైరల్ కావడంతో దీనిపై సన్నీలియోన్ స్పందించింది.  నెక్స్ట్ సెమిస్టర్ లో కలుసుకుందామని ఫన్నీగా ట్వీట్ చేసింది.