2 ఓవర్లు మిగిలుండగానే భారీ టార్గెట్ ఛేదన..

2 ఓవర్లు మిగిలుండగానే భారీ టార్గెట్ ఛేదన..

ఐపీఎల్ 2019లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ టార్గెట్‌ను మరో 12 బంతులు (రెండు ఓవర్లు) మిగిలుండగానే ఛేదించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. క్రిస్‌గేల్‌ 14, కేఎల్‌ రాహుల్‌ 2, మయాంక్‌ అగర్వాల్‌ 36, నికోలస్‌ పూరన్‌ 48, మన్‌దీప్‌సింగ్‌ 25, సామ్‌కరన్‌ 55 పరుగులు చేయడంతో కోల్‌కతా ముందు 184 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇక ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ 65, క్రిస్‌లిన్‌ 46, రాబిన్‌ ఉతప్ప 22, ఆండ్రీ రసెల్‌ 24, దినేశ్‌ కార్తిక్‌ 21 పరుగులు చేయడంతో కోలకతా సునాయస విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.