ఐపీఎల్ 2020 : కోల్‌కత నైట్ రైడర్స్ బలాలు... బలహీనతలు

ఐపీఎల్ 2020 : కోల్‌కత నైట్ రైడర్స్ బలాలు... బలహీనతలు

గౌతమ్ గంభీర్ న్యాయకత్వంలో రెండు సార్లు టైటిల్ అందుకున్న కోల్‌కత నైట్ రైడర్స్ ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, పవర్ హిరట్లు ఉన్న ఈ జట్టు మాత్రం గంభీర్ తప్పుకున్న తర్వాత అంతగా ప్రదర్శన చేయడం లేదు. కానీ ఈ ఏడాది జట్టులో కొన్ని మార్పులు చేసిన నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ ఆదుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా ఈ రోజు తమ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో కోల్‌కత ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనేది చూడాలి.

బలాలు : ఈ జట్టుకు ప్రధాన బలం రస్సెల్ సూపర్ హిట్టింగ్. అలాగే మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్న ఈ జట్టుకు అద్భుతమైన ఆల్ రౌండర్లు, స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఇక ఈ జట్టులో కీ ప్లేయర్స్ గా దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు.

బలహీనతలు : అయితే ఈ జట్టు కూడా ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల పైన ఆధారపడుతుంది. కమిన్స్ కు తోడుగా పేస్ బాధ్యతలు పంచుకోవడానికి మరో పేసర్ లేడు. అలాగే మ్యాచ్ చివరి వరకు తీసుకువచ్చి వదిలేయడం ఈ జట్టుకు అలవాటు. మరి చూడాలి ఈ ఏడాది కూడా కోల్‌కత ఆ అలవాటునే కొనసాగిస్తుందా.. లేదా మార్చుకుంటుందా అనేది.