చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్: 162

చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్: 162

కోల్‌కత్తా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ క్రిస్ లిన్ (82, 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) ఒంటరి పోరాట చేశాడు. చెన్నై స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌తాహిర్‌ నాలుగు కీలక వికెట్లు తీసి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు. శార్దుల్‌ ఠాకుర్‌ రెండు, మిచెల్‌ శాంట్నర్‌ ఒక వికెట్‌ తీశారు. చెన్నై జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా, కోల్‌కతా జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. క్రిస్‌లిన్, సునీల్ నరైన్‌లు తిరిగి జట్టులో చేరగా, ఫెర్గ్యూసన్ స్థానంలో గర్నీకి చోటు లభించింది. చెన్నై ఒక్కదాంట్లో ఓడి ఆరు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.