చెలరేగిన కోల్ కత్తా, ముంబయి టార్గెట్ః 233

చెలరేగిన కోల్ కత్తా, ముంబయి టార్గెట్ః 233

సొంత మైదానంలో కోల్ కత్తా నైట్‌ రైడర్ జట్టు దుమ్మురేపింది. ముంబయితో జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి ఓపెనర్లు క్రిస్ లిన్, శుభ్‌మాన్ గిల్ కలిసి 96 పరుగులు చేశారు. హాఫ్ సెంచరీ చేసిన క్రిస్ లిన్(54, ) రాహుల్ చాహర్ బౌలింగ్ లో లివీస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్ మాన్ గిల్ (76,45 బంతుల్లో 6 సిక్సులు, 4 ఫోర్లు) చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. హార్థిక్ పాండ్యా వేసిన 16వ ఓవర్ 2వ బంతికి గిల్ ఔట్ అయ్యాడు. అప్పుడు వచ్చిన ఆల్ రౌండర్ రస్సెల్(80, 40బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్స్ లు) రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబయి ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. ముంబయి బౌలింగ్‌లో రాహుల్ చాహర్, హార్థిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.