కోహ్లీ వీరవిహారం, కోల్ కత్తా టార్గెట్ః 214

కోహ్లీ వీరవిహారం, కోల్ కత్తా టార్గెట్ః 214

ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌ కత్తా నైట్ రైడర్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి ప్రత్యర్థికి భారీ టార్గెట్ ను నిర్దేశించాడు. ముందుగా టాస్ గెలిచిన కోల్ కత్తా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కత్తా కెప్టెన్ విరాట్ కోహ్లీ (110, 58 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు) వీరవిహారం చేశాడు. కోహ్లీకి మొయిన్ అలీ (66 పరుగులు, 28 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సులు ) చక్కటి సహకారం అందించాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పరిశిద్ చేతికి చిక్కాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (11 పరుగులు, 11 బంతులు, 2 ఫోర్లు) నరేన్ బౌలింగ్ లో నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో బ్యాట్స్ మెన్ అక్షదీప్ నాథ్ (13 పరుగులు, 15 బంతుల్లో, 1 సిక్స్ ) రసెల్ బౌలింగ్ లో ఉతప్పకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కోల్ కత్తా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, అండ్రూ రసెల్ తలో వికెట్ తీసుకున్నారు.