టాస్ గెలిచి ధోనీకి బ్యాటింగ్ ఇచ్చాడు...

టాస్ గెలిచి ధోనీకి బ్యాటింగ్ ఇచ్చాడు...

ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది... అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది... ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇది 33వ మ్యాచ్‌... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో టాప్‌ స్పాట్‌లో ఉన్న చెన్నై... ఈ మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టాలని భావిస్తోండగా... ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లే గెలిచి నాల్గో స్థానంలో ఉన్న కోల్‌కతా... హోం గ్రౌండ్‌లో విజయం సాధించాలనే కసితో ఉంది.