గిల్ మెరుపులు.. కోల్‌కతా విజయం

గిల్ మెరుపులు.. కోల్‌కతా విజయం

వరుస విజయాలతో దూసుకుపోతూ.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్ తగిలింది. చెన్నైతో గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ఓపెనర్‌ వాట్సన్‌(25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్(15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌లు)లు వరుస బౌండరీలు బాదడంతో స్కోర్ పరుగులు పెట్టింది. అనంతరం సురేశ్‌ రైనా (26 బంతుల్లో 31; 4 ఫోర్లు), రాయుడు(21)లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. చివరలో కెప్టెన్‌ ధోని (25 బంతుల్లో 43 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సునీల్‌ నరైన్‌, పీయూష్‌ చావ్లాలు తలో రెండు వికెట్లు తీశారు.

178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ నరైన్(20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)మరోసారి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 45 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 4 వికెట్లే కోల్పోయి విజయంను సొంతం చేసుకుంది. నరైన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.