ఐపీఎల్ 2020 : సూపర్ ఓవర్ డ్రామా.. విజయం సాధించిన కేకేఆర్... 

ఐపీఎల్ 2020 : సూపర్ ఓవర్ డ్రామా.. విజయం సాధించిన కేకేఆర్... 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కత ను బాగానే కట్టడి చేసింది సన్‌రైజర్స్. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కోల్‌కత ఎప్పుడు కూడా భారీ పరుగులు చేసే విధంగా కనిపించలేదు. కానీ చివర్లో కెప్టెన్ మోర్గాన్ (34) తో కలిసి మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్(29) పరుగులు చేయడంతో కోల్‌కత నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ ఓపెనర్లు గా జానీ బెయిర్‌స్టో  కేన్ విలియమ్సన్ వచ్చి మొదటి వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 29 పరుగుల వద్ద విలియమ్సన్ వెనుదిరగానే వన్  డౌన్ లో వచ్చిన ప్రియమ్ గార్గ్ (4) కూడా వెంటనే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన వార్నర్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. సన్‌రైజర్స్ విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా వార్నర్ మూడు ఫోర్లు కొట్టాడు. ఇక చివరి బంతికి రెండు పరుగుల కావాల్సిన సమయంలో  ఒకే పరుగు రావదంతో మ్యాచ్ టై అయింది.

దాంతో సూపర్ ఓవర్ డ్రామా మొదలయింది. కానీ ఈ డ్రామా లో సన్‌రైజర్స్ సూపర్ గా ప్లాప్ అయ్యింది. మొదటి 4 బంతుల్లోనే రెండు వికెట్లు సమర్పించుకొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో కోల్‌కత విజయానికి కేవలం మూడు పరుగులే కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కేకేఆర్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన మోర్గాన్, కార్తీక్ 4 బంతుల్లో మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. దాంతో ఈ ఐపీఎల్ లో ఐదో విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలవగా ఈ ఓటమితో ఆరో పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్ 5 వ స్థానంలో ఉంది.