టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా... 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా... 

ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ ఈరోజు షార్జా లోని షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్నది.  ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ జట్టు రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది.  అటు కోల్ కతా జట్టు కూడా మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు గెలిచింది.  రన్ రేట్ విషయానికి వస్తే ఢిల్లీ జట్టు కోల్ కతా జట్టు కంటే మెరుగ్గా ఉన్నది.  పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు రెండో ప్లేస్ లో ఉండగా, కోల్ కతా జట్టు మూడో ప్లేస్ లో ఉన్నది. కాగా, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  యూఏఈలోని మూడు స్టేడియంలలో షార్జాలో ఉన్న స్టేడియం చిన్న స్టేడియం కావడంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.