చార్జర్‌ కేబుల్‌ తో భర్తను హతమార్చిన భార్య..!

 చార్జర్‌ కేబుల్‌ తో భర్తను హతమార్చిన భార్య..!

కోల్ కత్తాలో భర్తను హత్య చేసిన మహిళా న్యాయవాదికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళా న్యాయవాది అనిందితా పాల్ తన భర్త  రజత్‌ డేనిని మొబైల్ చార్జర్ తో హతమార్చిందని ఆరోపణలు ఎదురుకొంటోంది. ఈ కేసును విచారించిన పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు అనిందితా పాల్ తన భర్త రజత్ ను హత్య చేసినట్టు నిర్ధారించింది. అంతే కాకుండా కేసునుండి తప్పించుకోవడానికి అనిందిత పథకం పన్నినట్టు గుర్తించింది. దాంతో నిందితురాలికి యావజ్జివ కారాగార శిక్షతో పాటు 10వేల జరిమానా విధించింది. కేసులు ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడాదిపాటు శిక్ష విధించింది.