9 నెలల తరువాత షాప్ తెరిచి...షాకైన వ్యాపారి...!!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మార్చి నుంచి కొన్ని నెలలపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో దుకాణాలను క్లోజ్ చేసుకొని అనేక మంది వేరేవేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలానే కోల్ కతా కు చెందిన 74 ఏళ్ల చింతామణి మోని అనే వ్యక్తి తన షాప్ ను క్లోజ్ చేసి ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ వెళ్ళాడు. ఇటీవలే తిరిగి వచ్చి షాప్ తెరిచి చూసి షాక్ అయ్యాడు. 9 నెలల తరువాత షాప్ తెరిచి చూడగా షాపులో ఉండాల్సిన విలువైన వస్తువులు, నగదు మాయమైనట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 1969 నుంచి చింతామణి మోని షాప్ ను నిర్వహిస్తున్నాడు. సైకిల్ షాప్ రిపేర్ తో పాటుగా మొబైల్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా షాప్ ను క్లోజ్ చేసే ముందు విలువైన మొబైళ్ళు, కొంత నగదు, పాతకాలం నాటి రేడియో షాప్ లో ఉన్నాయని, తన షాప్ ను దొంగలు దోచేశారని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)