టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్-11లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. ఇక కోల్‌కతా జట్టు కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే.. కావున ఈ మ్యాచ్ లో రసవత్తర పోరు కాయం. రింకూ సింగ్, టామ్ కర్రన్ లు కోల్‌కతా జట్టులోకి వచ్చారు. మరోవైపు గత మ్యాచ్ లోని జట్టుతోనే ఆడుతుంది ముంబై.

జట్లు:

ముంబై: సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జీన్ పాల్ డుమినీ, ఇశాన్ కిషన్, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాగాన్, మయాంక మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.

కోల్‌కతా: క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేశ్ కార్తీక్, రింకూ సింగ్, అండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, టామ్ కర్రన్, ప్రశిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.