మూడో వికెట్ కోల్పోయిన కోల్ కతా

మూడో వికెట్ కోల్పోయిన కోల్ కతా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 182 విజయలక్ష్యంతో  బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి క్రిస్ లిన్(7) రషీద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాబిన్ ఉతప్ప (35) ను కౌల్ బౌల్డ్ చేశాడు. దినేష్ కార్తీక్ (2) సందీప్ శర్మ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పదమూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజ్‌లో నితిష్ రానా(50), ఆండ్రూ రసెల్(1) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఆఫ్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.