టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ 'ఇప్పటి వరకూ అంతా బాగా కలిసొచ్చింది. ఈ పిచ్‌ అద్భుతంగా ఉంది. అందుకే బౌలింగ్‌ ఎంచుకున్నాం. మా జట్టులో క్రీస్ లిన్, సునీల్ నరైన్, అర్నాల్డ్ రస్సెల్, మిషెల్ జాన్సన్ నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు' అని చెప్పాడు. బెంగళూరు జట్టు కెప్టెన్‌ కోహ్లీ మాట్లాడుతూ తాము గెలిచినా బౌలింగే ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. డివిలియర్స్, మెక్‌కల్లమ్, డికాక్, వోక్స్‌ నలుగురు విదేశీ ఆటగాళ్లతో బెంగళూరు బరిలోకి దిగుతోంది. బెంగళూరు ప్లేయింగ్‌ ఎలెవన్‌: డీకాక్‌, మెక్‌కల్లమ్‌, కోహ్లీ, డివీలియర్స్, సర్ఫరాజ్‌ఖాన్‌, మణ్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వోక్స్‌, కుల్వంత్‌, ఉమేశ్‌యాదవ్‌, చాహల్‌ కోల్‌కతా ప్లేయింగ్‌ ఎలెవన్‌: లీన్‌, ఊతప్ప, నితీశ్‌రాణా, దినేశ్‌కార్తీక్‌, రింకూ సింగ్‌, రసెల్‌, సునీల్‌ నరేన్‌, పియూష్‌ చావ్లా, వినయ్‌కుమార్‌, మిచెల్‌జాన్సన్‌, కుల్దీప్‌ యాదవ్‌