హీరో అజిత్ ఫోటోగ్రఫి సూపర్బ్

హీరో అజిత్ ఫోటోగ్రఫి సూపర్బ్

అజిత్ మల్టీ టాలెంటెడ్ హీరో అని మరోసారి రుజువు చేసుకున్నాడు.  హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న అజిత్, ఇటీవల ఎంఐటి విద్యార్థులు రూపొందించిన దక్ష డ్రోన్ టీమ్ ను లీడ్ చేసి తనలో ఉన్న మెకానికల్ ఇంజనీర్ టాలెంట్ ను బయటపెట్టాడు.  దక్ష డ్రోన్ ను తయారు చేసిన యూనిట్ కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును కూడా ప్రకటించింది.  

ఇదిలా ఉంటె, అజిత్ వరల్డ్ ఫోటోగ్రఫి డే రోజున శృతి హాసన్, కాజల్ అగర్వాల్ ఫోటోలను షేర్ చేశారు.  అజిత్ స్వయంగా వారి ఫోటోలను తీశాడు.  తనలో అద్భుతమైన ఫోటో గ్రాఫర్ ఉన్నాడని ఆ ఫోటోలను చూస్తుంటే అర్ధం అవుతున్నది.  ప్రస్తుతం అజిత్ విశ్వాసం సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా అజిత్ ఈ ఫోటోలను తీశాడట.