రష్మికపై కోలీవుడ్ సీరియస్ ...

రష్మికపై కోలీవుడ్ సీరియస్ ...

రష్మిక మందన్న టాలీవుడ్లో టాప్ నటిగా దూసుకుపోతున్నది.  ఛలో సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన రష్మిక .. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తరువాత టాప్ తారగా ఎదిగింది.  ప్రస్తుతం తెలుగులో నితిన్ భీష్మ, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలు చేస్తున్నది.  తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. తమిళ సినిమాలవైపు కూడా కన్నేసింది.  

ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు కార్తీకి జోడిగా నటిస్తోంది.  వెంకట్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.  అయితే, రష్మిక కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శించి ఓ లుక్ ను తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. సుల్తాన్ షూటింగ్లో నాలుగో రోజు అని మెసేజ్ చేసింది.  దీంతో యూనిట్ ఆమెపై కోపంగా ఉన్నారు.  అధికారికంగా ప్రకటించకుండా ఇలా చేయడం తప్పని యూనిట్ రష్మికను సున్నితంగా మందలించింది.