ఆ హీరో 37 రోజుల్లో... ఇలా ఎలా...?

ఆ హీరో 37 రోజుల్లో... ఇలా ఎలా...?

హైట్, వెయిట్ .. మంచి లుక్ ఉంటె హీరోలా ఉన్నారని అంటుంటారు. అందుకే హీరోలు అదే లుక్ ను మెయింటైన్ చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు.  వెయిట్ పెరగకుండా ఉండేందుకు డైట్, జిమ్ వంటివి చేస్తుంటారు.  కొంత గ్యాప్ తీసుకుంటే వెంటనే షేప్ మారిపోయి వెయిట్ పెరిగేస్తుంటారు.  ఇలా వెయిట్ పెరిగి గుర్తుపట్టలేకుండా మారిపోయిన హీరో శింబు.  

మన్మధ సినిమాతో శింబు కోలీవుడ్ లోను, టాలీవుడ్ లోను సంచలనం సృష్టించాడు.  ఎంత సక్సెస్ సాధించాడో... కొన్ని వివాదాల కారణంగా అంతే పరాజయం తెచ్చుకున్నాడు.  దీంతో శింబు విపరీతంగా వెయిట్ పెరిగిపోయాడు.  బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి.  దీనిని గుర్తించిన శింబు... లండన్ వెళ్లి అక్కడ వెయిట్ తగ్గేందుకు ప్రయత్నం చేశాడు.  37 రోజుల్లోనే 13 కేజీలు వెయిట్ తగ్గాడు.  వెయిట్ తగ్గి గ్లామర్ గా కనిపించిన శింబు ప్రస్తుతం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ మనాడు చేస్తున్నాడు.  వెంకట్ ప్రభు దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా చేస్తోంది.