ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం

ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునే ఘటన అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై అందరం స్పందించాం. హాజీపూర్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బాధితులు అమరణ దీక్షకు దిగినా సీఎం కేసీఆర్ మనసు కరగలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన మానవత్వాన్ని నిరూపించుకోవాలని అన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం అందించాలిని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.