ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారు..

ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారు..

కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొన్నారని మాజీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి ఎంపీగా గెలుపొందిన తరువాత నల్లగొండ పట్టణానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమటిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రిగా నీతి నిజాయితితో పనిచేసినందుకే కార్యకర్తలు స్వచ్చందంగా గుండెల్లో పెట్టుకుని గెలిపించారని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పార్లమెంట్ లో పోరాడుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి లక్ష్మీని గెలిపించుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలనను, ప్రజలను గాలికి వదిలేసి దోపిడీలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే కాలంలో మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంటామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

భువనగిరి లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిదే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ప్రజలు ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు.