గద్దర్ తో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గద్దర్ తో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రజా గాయకుడు గద్దర్‌ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన కోమటిరెడ్డి తనకు మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తొలిదశ ఉద్యమంలో.. అటు మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారని తెలిపారు. తన పాటల ద్వారా ఉద్యమాన్ని పరుగులు పెట్టించారన్నాని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదివరకే గద్దర్ ను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే.