భువనగిరి ఎంపీగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది

భువనగిరి ఎంపీగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది

భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రాహుల్ కు ఉన్న నమ్మకాన్ని నిలబెడుతామని స్పష్టం చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సొంత అన్నలా, తమ్ముడిలా ఉంటానని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తమ కుటుంబం చేసిన సేవలను గుర్తించి భువనగిరి లోక్ సభ అభ్యర్ధిగా గెలిపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను భువనగిరి లోక్ సభ పరిధిలో చేశామని కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తు చేశారు. 

తొలుత భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కి భావించారు. చివరికి ఆయన వెనక్కి తగ్గడం, కోమటిరెడ్డి బలమైన నేత కావడంతో అధిష్టానం కోమటిరెడ్డి వైపే మొగ్గుచూపింది. రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉంది.