గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ..

గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ..

తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. గడ్కరీతో ఇవాళ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3150 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోందన్నారు. 

కేవలం 1300 కిలోమీటర్ల మేర రహదారులనే కేంద్రం జాతీయ రహదారులుగా గుర్తించిందని గుర్తుచేశారు. మిగిలిన రహదారులను కూడా నోటిఫై చేసి అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో రోడ్లన్నీ నాశనమయ్యాయని, హైదరాబాద్‌ నుంచి విజయవాడ 8 లైన్ల రహదారిలో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు వదిలేశారని ఆరోపించారు. రహదారుల విషయమై త్వరలోనే ప్రధానిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తానని కోమటిరెడ్డి చెప్పారు.