హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్...

హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ వివాదంలో రోజుకో మలుపు చోటుచేసుకుంటుంది... ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్‌ను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు వెలువరించిన కోర్టు... తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆ ఇద్దరిని ఎమ్మెల్యేలుగా పరిగణించాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై మళ్లీ హైకోర్టుకు వెళ్లారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.  హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా సెక్రెటరీని చేశారు. కాగా, ఈ శుక్రవారం ఎమ్మెల్యేల కోర్టు ధిక్కారణ పిటిషన్‌ విచారణకు రానుంది.