'మోడీ పాదసేవ తప్ప కేసీఆర్ చేసిందేమిటి?'

'మోడీ పాదసేవ తప్ప కేసీఆర్ చేసిందేమిటి?'

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబం తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదు ప్రధాని నరేంద్ర మోడీ సేవ తప్ప అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... గడిచిన ఐదేళ్లలో 15 ఎంపీ సీట్లు ఉంటేనే మోడీకి పాద సేవ చేసిన కేసీఆర్.. ఇప్పుడు 16 గెలిస్తే చేసింది ఏమీలేదు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను గెలిపించాలని పిలుపునిచ్చిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ కు వేసే ప్రతీ ఓటు మోడీకే చేరుతుందని ఆరోపించారు. ప్రధాని మోడీ నల్లధనం వెలికి తీసి పేదల ఖాతాలో జమ చేస్తానను మాట ఇచ్చి నిలబెట్టుకోలేదన్న కోమటిరెడ్డి.. సోనియాగాంధీ వల్ల తెలంగాణ వచ్చింది.. ప్రజలు గుర్తించి కాంగ్రెస్‌కు పట్టాం కట్టానున్నారని తెలిపారు. గతంలో మా సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి.. నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవ చేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుంటానన్నారు.