భువనగిరి బరిలో కోమటిరెడ్డి...!

భువనగిరి బరిలో కోమటిరెడ్డి...!

లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారు  చేసింది అధిష్టానం... తొలుతు ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీ చేయాలని భావించినా... కోమటిరెడ్డి పోటీ చేయాలనుకోవడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మధుయాష్కీ వెనక్కి తగ్గడం, కోమటిరెడ్డి బలమైన నేత కావడంతో.. ఆయన వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గుచూపిందంటున్నారు. ఇప్పటికే ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ... రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి మధుయాష్కీ పోటీచేసే అవకాశం ఉంది.