దుబ్బాకకు బలగాలు పంపండి: సీఈసీకి కోమటిరెడ్డి లేఖ

దుబ్బాకకు బలగాలు పంపండి: సీఈసీకి కోమటిరెడ్డి లేఖ

దుబ్బాక ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపి.. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా.. పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ను లేఖలో కోరారు. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  కింద కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దుబ్బాకలో ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని పంపి.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికల స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.