సీక్వెల్ తో రానున్న అంజలి 

సీక్వెల్ తో రానున్న అంజలి 

అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి. రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు త్వరలోనే గీతాంజలి 2 గా సీక్వెల్ రాబోతోంది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను డ్యాన్సర్ ప్రభుదేవా ఇవాళ ఉదయమే రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ ను నిర్మించిన కోనవెంకట్, ఎం.వి.వి సినిమాస్ వారు ఈ సీక్వెల్ ను నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఇండో అమెరికన్ వ్యక్తి సమకూర్చారట. దీనిపై కోనా వెంకట్ మాట్లాడుతూ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం ఎవరు వహించనున్నారు. మిగిలిన ఇతర సిబ్బంది వివరాలు తెలియజేస్తామని కోనా తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.