మోడీకీ ప్రత్యామ్నాయం మా నాయకుడే..

మోడీకీ ప్రత్యామ్నాయం మా నాయకుడే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే తనకు ధీటైన, బలమైన ప్రత్యర్థి అని ప్రధాని మోడీ భయపడుతున్నారని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. అందుకే కావాలనే బాబును మోడీ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మోడీని ఎవరూ ఎదిరించలేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రశ్నించారని అన్నారు. జాతీయ పార్టీలపై దేశ ప్రజలకు విశ్వాసం లేదని, తమ తమ రాష్ట్రాలకు సరైన రీతిలో న్యాయం జరగడం లేదని ప్రాంతీయ పార్టీలు గట్టిగా భావిస్తున్నాయని కొనకళ్ల మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడు చంద్రబాబు అని, దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉన్నదని గుర్తుచేశారు. దేశ ప్రజలంతా మోడీ పాలనతో విసుగెత్తిపోయారని, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని అన్నారు. మోడీకి చంద్రబాబే ప్రత్యామ్నాయం అని కొనకళ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దేశం కూడా ముఖ్యమేనని అన్నారు.