ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు : కొణతాల

ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు : కొణతాల

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పెరిగిన ఓటింగ్ శాతం టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అన్నారు.  తనకు కూడా టీడీపీ సంక్షేమ పథకాలు నచ్చాయని, అందుకే వారికి మద్దతు తెలిపానని అన్నారు.  అలాగే 'ఈసారి మహిళలు ఓటింగ్ చాలా పెరిగింది. నాకు ఇప్పటివరకు ప్రభుత్వం వ్యతిరేకత పెద్దగా కనబడలేదు.  చంద్రబాబు ఒక్కడే కేంద్రం పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.  బీజేపీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు.  బిజేపి రాష్ట్రనికి ప్రేత్యేక హోదా ఇవ్వదు సరికదా విభజన హామీలు కూడా నెరవేర్చలేదు.  మోడీ వచ్చిన ప్రతి సారి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..  ఈవిఎం మిషన్లుకి, వివిప్యాట్ లకి నేను వ్యతిరేకం కాను.  కానీ ప్రతి వివి.పాట్ లెక్క వేయాల్సిందే.  ఈవిఎంలో లోపాలను సవరించకుండా పోలింగ్ నిర్వహించడం కరెక్టు కాదు. ఎన్నికలు కమిషన్ కి సరైన విది విధానాలు లేవు.  వివిప్యాట్లు లెక్క వేయడం పెద్ద పని అంటున్నారు.  రిజల్ట్ కోసం వివిప్యాట్లు అన్నింటిని లెక్కించడానికి ఎన్ని రోజులైనా అగుతాం' అన్నారు.