కార్యకర్తలతో భేటీ.. వైసీపీ గూటికి మాజీ మంత్రి..!

కార్యకర్తలతో భేటీ.. వైసీపీ గూటికి మాజీ మంత్రి..!

కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. అనకాపల్లిలోని రావుగోపాలరావు ఆడిటోరియంలో కొణతాల రామకృష్ణ ఆత్మీయ సమావేశం న ఇర్వహిస్తున్నారు. రింగ్‌రోడ్‌లోని క్యాంప్ ఆఫీసు నుండి ఆడిటోరియం వరకు భారీగా ర్యాలీగా చేరుకున్న ఆయన... అనంతరం కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ర్యాలీ, సమావేశానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. కాగా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అనకాపల్లిలో కార్యకర్తల సమావేశంలో రాజకీయ భవిష్యత్ పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇక కొణతాలను అనకాపల్లి ఎంపీగా బరిలోకి దింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.