మంత్రి పదవి ఇస్తామని చెప్పి... ఇవ్వలేదు: సురేఖ

మంత్రి పదవి  ఇస్తామని  చెప్పి... ఇవ్వలేదు: సురేఖ

కేసీఆర్ గారు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని కొండా సురేఖ అన్నారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడుతూ... వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వరంగల్ లో 12 సీట్లు ఉంటే.. మా టిక్కెట్ మాత్రమే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీసీ మహిళ అయిన నాకు.. ఎస్సి అయిన అయిన బొడిగే శోభకు టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణామేంటని సురేఖ ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో చాలాసార్లు తమను సంప్రదించారని.. అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తెల్చిచెప్పామన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 
మహిళలు లేకుండా తెలంగాణ వచ్చినదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ క్యాబినెట్ లో మహిళా మంత్రి లేకపోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గతంలో నాకు ఉన్న మంత్రి పదవిని తృణప్రయణగా వదిలి వేసానాని పేర్కొన్నారు. నేను లేవనెత్తిన ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు తెలియకుండా బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. మా సొంత డబ్బులతో వరంగల్ ఈస్ట్ గెలిచాం.. మేము గెలిచిన తర్వాత అన్ని ఎన్నికల్లో మా సొంత డబ్బు ఖర్చు చేసాం.. టీఆర్ఎస్ కి అండగా ఉన్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదని సురేఖ తెలిపారు.