కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ అరెస్ట్ !

కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ అరెస్ట్ !

చేవెళ్ల లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ సందీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గచ్చిబౌలి సిన్ టవర్స్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ వద్ద నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  ఇప్పటివరకు 15 కోట్ల డబ్బును ఓట్ల కోసం పంపిణీచేసినట్టు తెలుస్తోంది.  పంపకాల వివరాలన్నీ కోడింగ్ రూపంలో ఉండటంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.  15 కోట్ల పైచిలుకు నగదుని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సందీప్ రెడ్డి కలిసి పంచినట్లుగా గుర్తించారు.