రిగ్గింగ్ చేసినా నేనే గెలుస్తా !

రిగ్గింగ్ చేసినా నేనే గెలుస్తా !

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.  జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  చేవెళ్ల లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సక్రమంగా జరిగితే తనకు 2 లక్షల పైచిలుకు మెజారిటీ వస్తుందని, అధికార తెరాస రిగ్గింగ్ చేసినా తానే గెలుస్తానని, రెండవ స్థానం కోసం తెరాస, బీజేపీలు పోటీపడుతున్నాయని అన్నారు.