డిసెంబ‌ర్‌లో కొర‌టాల ముహూర్తం

డిసెంబ‌ర్‌లో కొర‌టాల ముహూర్తం

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా ఎప్ప‌టినుంచి సెట్స్‌కెళుతుంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం రానే వ‌చ్చింది. కొణిదెల కాంపౌండ్ అప్‌డేట్ ప్ర‌కారం.. మెగాస్టార్ న‌టిస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ మెజారిటీ పార్ట్ డిసెంబ‌ర్ ముందే పూర్త‌వుతుంది. ఆ నెల‌లోనే కొర‌టాల‌తో ఓపెనింగ్ చేస్తారని తెలుస్తోంది. 

సైరా త‌ర‌వాత మెగాస్టార్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది కొర‌టాల‌కే. అత‌డు వినిపించిన సింగిల్ లైన్ విని ఓకే చెప్పారు. ప్ర‌స్తుతం విదేశీ టూర్ ముగించుకున్న కొర‌టాల చిరు కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నారట‌. ఈ సినిమాకి రామ్‌ చ‌ర‌ణ్ నిర్మాత‌. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థతో క‌లిసి చెర్రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ ప్రాజెక్టుపై మ‌రిన్ని వివ‌రాలు త్వరలోనే తెలియనున్నాయి.