గీత ఆర్ట్స్ తో పోటీ పడుతున్న కొరటాల

గీత ఆర్ట్స్ తో పోటీ పడుతున్న కొరటాల

మహేష్ బాబు 26 వ సినిమా తరువాత చేయబోయే సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి.  మహేష్ 27 వ సినిమా కోసం పరశురామ్ రెడీ అవుతున్నాడు.  ఇప్పటికే కథ వినిపించిన పరశురామ్... స్క్రిప్ట్ వర్క్స్ కూడా చకచకా చేసుకుంటూ వెళ్తున్నాడు.  స్క్రిప్ట్ పూర్తయ్యాక మహేష్ ను కలిసి వినిపిస్తాడట.  స్క్రిప్ట్ ఒకే అయితే... గీతా ఆర్ట్స్ లో సినిమా ఉండే అవకాశం ఉంది.  మెగాహీరోలు కాకుండా బయట హీరోలతో సినిమాలు చేసింది చాలా తక్కువ.  మహేష్ తో సినిమా చేయాలని గీత ఆర్ట్స్ సంస్థ ఎప్పటి నుంచో అనుకుంటున్నది.  

ఇదిలా ఉంటె, మహేష్ బాబు... పరశురామ్ సినిమాను కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాడు.  మహేష్ సినిమా కోసం కొరటాల నిర్మాతగా మారాలని అనుకుంటుండటం విశేషం.  మరి మహేష్ 27 వ సినిమాను నిర్మించే అవకాశం ఎవరికీ దక్కుంతుందో చూద్దాం.