దాడితో మాకు సంబంధం లేదు : కోటంరెడ్డి

దాడితో మాకు సంబంధం లేదు : కోటంరెడ్డి

నిన్న నెల్లూరులో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.   పొందుతున్న తిరుమల నాయుడు తమ అభ్యర్థి గెలుపుకు సహకరించలేదని కక్షతోనే తనపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులు దాడులు చేశారని వాగ్మూలం ఇచ్చారు.  దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ అజీజ్, ఎంపీ అభ్యర్థి బీద రవిచంద్ర తీవ్రంగా స్పందించారు. 

వారికి సమాధానంగా 'తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్ష్యలున్నాయి.. దాడిపై విచారణ చేపట్టకుండానే నాపై అబాండాలు వేయడం సరికాదు.  అబ్దుల్ అజీజ్ నువ్వు ముందు నోరు అదుపులో పెట్టుకో.  నాపై వేసిన నిందకు బీదా రవిచంద్ర సమాధానం చెప్పాలి.  ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి.  మా కార్యాలయం పై దాడి ఘటనలో బీదా రవిచంద్ర హస్తం ఉంది.  మా కార్యాలయంపై మారణాయుధాలతో దాడి చేసినా శాతియుతంగా ఉన్నాం.  ఎన్నికల్లో ప్రజాతీర్పును అందరూ గౌరవించాలి.  బెదిరింపులకు పాల్పడటం కరెక్టు కాదు' అన్నారు.