కోటిదీపోత్సవం లైవ్...

కోటిదీపోత్సవం లైవ్...

ఇల కైలాసంగా మారిపోయింది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం. కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. నాలుగో రోజు ఉత్సవంలో భాగంగా భక్తులకు శ్రీ వెంకటేశ్వర ముడుపుల పూజ, అలాగే భక్తులచే  శ్రీ వెంకటేశ్వర ముడుపుల పూజ జరగనుంది. సకల సౌభాగ్యాలను అనుగ్రహించే ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామీ కల్యాణోత్సవం ఇవాళ్టి పూజలో విశేషం. గరుడ వాహనం మీద శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైభవం కమనీయ పండుగలా సాగనుంది. శ్రీ స్వరూపానంద,శ్రీ చిదాత్మానంద స్వామీజీల ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం భక్తులను ఆకట్టుకోనున్నాయి.  కమనీయంగా సాగుతోన్న కోటిదీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..