కోటి దీపోత్సవం లైవ్ 

కోటి దీపోత్సవం లైవ్ 

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. ఆరో రోజు ఉత్సవంలో భాగంగా భక్తులచే అమ్మలగన్నఅమ్మకి కోటిగాజుల అర్చన చేయిస్తారు. లలితాసహస్రనామస్తోత్ర పారాయణ, బెజవాడ దుర్గామల్లేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా జరగనుండగా.. అనంతరం సింహవాహనంపై ఆదిపరాశక్తి అద్భుతంగా సాక్షాత్కారించనున్నారు.. మాతాజీల ఆశీర్వచనంతో పాటు డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి ప్రవచనాలు ఉంటాయి.  కమనీయంగా సాగుతోన్న కోటిదీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..