కోటిదీపోత్సవం లైవ్

కోటిదీపోత్సవం లైవ్

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. ఐదో రోజు ఉత్సవంలో భాగంగా భక్తులచే మహాదేవునికి కోటి పరిమళ పుష్పార్చన జరగనుంది. కనులపండుగగా రాధాకృష్ణుల అభిషేకం.. సర్వారిష్టాలను నివారించే ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ కళ్యాణం భక్తులను ఆకట్టుకోనున్నాయి. కల్పవృక్ష వాహనంపై నారసింహుని అనుగ్రహం భక్తులకు లభించనుంది. ఇక శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామివారి అనుగ్రహభాషణం అక్షయపాత్ర ఫౌండేషన్ శ్రీమధుపండితదాస ఆశీర్వచనాలు భక్తులకు కనునిప్పు చేయనున్నాయి. కమనీయంగా సాగుతోన్న కోటిదీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..