కోటిదీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు..

కోటిదీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు..

ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియం పరిసరప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. రోజురోజుకూ పెరిగిపోతున్న భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం కిటకిటలాడుతోంది... 14 రోజులు విజయవంతమైన కోటిదీపోత్సవం.. 15వ రోజుకు చేరుకుంది.. ఇవాళ్టి క్రతువులో భాగంగా కోటిదీపోత్సవ వేదికపై  అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. అలానే అన్నవరం శ్రీ సత్యనారాయణ కళ్యాణం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారు శేషవాహనంపై ఊరెరుగుతారు... శ్రీ నిశ్చలానంద సరస్వతి, పూరీ శంకరాచార్య స్వామివార్ల ఆశీర్వాదం, శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.