కోటిదీపోత్సవం...ఇల కైలాసంలో చివరి రోజు కార్యక్రమాలు..

కోటిదీపోత్సవం...ఇల కైలాసంలో చివరి రోజు కార్యక్రమాలు..

కార్తికమాసాన మహాదీపయజ్ఞం నేటితో పరిసమాప్తం కానుంది. న ఎన్టీఆర్ స్టేడియం పరిసరప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. రోజురోజుకూ పెరిగిపోతున్న భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం కిటకిటలాడుతోంది... 15 రోజులు విజయవంతమైన కోటిదీపోత్సవం.. 16వ రోజుకు చేరుకుంది. చివరి రోజు ఉత్సవంలో భాగంగా ఉజ్జయిని క్షేత్రంలో జరిగే మహాద్భుత ఘట్టం కోటిదీపోత్సవ వేదికపై సాక్షాత్కారం కానుంది. భక్తులే ఆచరించి తరించేలా మహాభస్మాభిషేకం జరగనుంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణం కైలాస వాహనంపై ఆదిదంపతుల వైభవం కొల్హాపూర్‌ మహాలక్ష్మీ దివ్యదర్శనం భక్తులను తరింపజేయనుంది. స్వామి శ్రీసుందర చైతన్యానందవారి అనుగ్రహభాషణం.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనధార భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి.