కోటిదీపోత్సవం : రెండో రోజు కార్యక్రమాలు

కోటిదీపోత్సవం :  రెండో రోజు కార్యక్రమాలు

భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. ఈ నెల 18వ తేదీవరకు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది భక్తి టీవీ. రెండో రోజు కోటిదీపోత్సవంలోని కార్యక్రమాలను ఓసారి పరిశీలిస్తే ఉడిపి పెజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థస్వామి, శ్రీ సుఖబోధానంద స్వాముల గారిచే అనుగ్రహ భాషణం శ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనం ఉంటుంది. వేదికపై మహా శివలింగానికి కోటి బిల్వార్చన జరగనుండగా.. భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన చేయిస్తారు. ఇక రెండోరోజు వరంగల్ భద్ర ఖాళీ అమ్మ వారి కల్యాణం కన్నుల పడువగా జరగనుండగా రావణ వాహన సేవ నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ మా కోటిదీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.