'కోటి దీపోత్సవం'లో ఈరోజు..

'కోటి దీపోత్సవం'లో ఈరోజు..

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కనులపండువగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నిన్న తిరుమల శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. ఇవాళ పదో రోజు కార్తీక సోమవారం ఏకాదశి శుభసమయాన అమర్‌నాథ్ హిమలింగానికి కోటి పరిమళ పుష్పార్చన, దక్షిణ కాశీ.. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు. నంది వాహనంపై శివపార్వతుల అనుగ్రహం, అష్టైశ్వర్య ప్రదాయిని కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శనం, ఆర్ష విద్యా గురుకులం శ్రీ విశ్వేశ్వరానంద అనుగ్రహ భాషణం, శ్రీనివాస బంగారయ్యశర్మ ప్రవచనం ఉంటుంది.