వైసీపీకి ఓట్లేస్తే బతుకులు నాశనమే..

వైసీపీకి ఓట్లేస్తే బతుకులు నాశనమే..

వైసీపీ డబ్బుల పార్టీ అని టీడీపీ నేత, మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ మూడు ఒకే తాను ముక్కలని ఎద్దేవా చేశారు. వైసీపీ కి ఓట్లేస్తే.. బతుకులు నాశనమే అని అన్నారు.  టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. దాడులకు భయపడేది కూడా లేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలను కాపాడే బాధ్యత మాదేనని, మంచిగా ఉంటే తామూ మంచిగానే ఉంటామని, ఫ్యాక్షన్ ను మరిచిపోయామని కోట్ల తేల్చి చెప్పారు.