టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా..?

టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా..?

మాజీ మంత్రి, సీనియర్‌ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి.. అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఈక్రమంలో వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి వైసీపీలో చేరేందుకు నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు.. అధినేత జగన్‌తో మాట్లాడినట్టు తెలిసింది. జగన్‌ సమక్షంలో వైసీపీలో సుబ్బారాయుడు రేపు చేరే అవకాలున్నాయి.