'ఒకే' అనిపించిన 'క్రాక్' వసూళ్లు

'ఒకే' అనిపించిన 'క్రాక్' వసూళ్లు

కరోనా విరామం తర్వాత పున:ప్రారంభమైన థియేటర్లకు ‘క్రాక్’ సినిమా థియేటర్లకు కళను తీసుకొచ్చింది. 50 % ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ మాస్ మహారాజ్ రవితేజ తన సత్తా చూపించాడు. ‘క్రాక్’ ఇప్పటివరకు ఏకంగా రూ.20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది, దాదాపు రూ.17 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పుడు లాభాల్లోకి వచ్చేసింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతుండగా, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. కాగా మొదటి రోజు క్రాక్ వివాదం చోటు చేసుకోకుండా ఉంటే ఈ సినిమా మరింత వసూళ్లను సాధించి ఉండేది. 2021 సంక్రాంతి హిట్ కొట్టిన చిత్రాల్లో క్రాక్ మొదటి స్థానాన్ని సంపాదించిందనే చెప్పాలి. సముద్రఖని, లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారనే చెప్పొచ్చు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్రాక్ సినిమాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది. వరస డిజాస్టర్స్‌ తరువాత రవితేజ హిట్ అందుకున్నాడు.