సంక్రాంత్రి విన్నర్‌గా మాస్‌ మహారాజ్‌

సంక్రాంత్రి విన్నర్‌గా మాస్‌ మహారాజ్‌

మాస్ మహారాజా రవితేజ మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రవితేజ చిత్రం 'క్రాక్' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ నెంబర్ వన్ గా నిలిచింది. పోటీగా విడుదైన రామ్ 'రెడ్', విజయ్ 'మాస్టర్', బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రాలని తోసి క్రాక్‌ను ఫస్ట్‌ ప్లేస్ లో నిలవటం విశేషం. అయితే రవితేజకు ఇలా సంక్రాంతి విజేతగా నిలవటం ఇది తొలిసారి కాదు. గతంలోనూ 2008, 2011లో కూడా సంక్రాంతికి వచ్చిన సినిమాలను బీట్ చేస్తూ విజేతగా నిలిచాడు.  2011 సంక్రాంతి బాలకృష్ణ 'పరమవీర చక్ర, సిద్ధార్గ్ 'అనగనగా ఓ ధీరుడు' సుమంత్ 'గోల్కొండ  హైస్కూల్'తో పాటు రవితేజ 'మిరపకాయ్' సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. వీటన్నింటిలో  'మిరపకాయ్' ఘాటెక్కిస్తూ ఆ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక 2008 సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ 'ఒక్క మగాడు', సంక్రాంతి రాజుఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన 'వాన', సుమంత్ 'పౌరుడు' తో పోటీ పడ్డ రవితేజ 'కృష్ణ' సందడి సందడి చేసి విన్నర్ అనిపించుకోవడం విశేషం. ఇలా మూడు సార్లు విజేతగా నిలిచిన రవితేజ 2010 సంక్రాంతికి వెంకటేశ్ 'నమో వెంకటేశ', నవదీప్ 'ఓం శాంతి', జూనియర్ 'అదుర్స్'తో 'శంభో శివశంభో' అంటూ పోటీ పడ్డాడు. అయితే ఎన్టీఆర్ విన్నర్ గా నిలవగా... రవితేజ మాత్రం రన్నర్ గా నిలవటం విశేషం. అంతే కాదు 2003లో కూడా  'ఈ అబ్బాయి చాలామంచోడు'తో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ ఏడాది 'ఒక్కడు'తో మహేశ్ బ్లాక్ బస్టర్ కొట్టడా... ఫ్యామిలీ ఆడియన్స్ 'పెళ్ళాం ఊరెళితే' సంబరాలు చేసేసుకున్నారు.