జంగిల్ బుక్‌గా వైష్ణవ్ తేజ్ తాజా సినిమా..?

జంగిల్ బుక్‌గా వైష్ణవ్ తేజ్ తాజా సినిమా..?

టాలీవుడ్‌లోకి సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా తనదైన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. వైష్ణవ్ తొలి సినిమా ఉప్పెనతోనే టాలీవుడ్‌కి బ్యూటీ కృతి శెట్టి కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వైష్ణవ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన పుస్తకం ‘కొండపొలం’ ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొదటగా ఈ సినిమాకి కూడా కొండపొలం పేరునే ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ ‘జంగిల్ బుక్’ పేరును ఖరారు చేశారని టాక్ వస్తుంది. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ అతి త్వరలోనే వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.