400 రోజులు పనిచేశా.. బాధగా ఉంది : క్రిష్

400 రోజులు పనిచేశా.. బాధగా ఉంది : క్రిష్

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ రెండింటికీ సంబంధించి నడుస్తున్న హాట్టాపిక్ 'మణికర్ణిక'.  గత శుక్రవారం సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద  విజయవంతంగా నడుస్తోంది.  ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆఖరులో దర్శకత్వ బాధ్యతలు వహించిన కంగనాకే దక్కుతోంది.  తాజాగా క్రిష్ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు 400 రోజులు పనిచేశానని, అలాంటిది తాను సినిమాను వదిలేసి వచ్చానంటుండటం బాధగా ఉందని, ఎంతో కష్టపడి రాసి, తీసిన సన్నివేశాల్ని కంగనా తన ఇష్టానికి తీసేసిందని చెప్పుకొచ్చాడు.  అలాగే తాను తీసింది గోల్డ్ అయితే కంగనా దాన్ని సిల్వర్ మాదిరిగా చేసిందని విమర్శలూ చేస్తున్నారు.